ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత్రికేయులకు 25 వేల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించండి

ABN, First Publish Date - 2020-03-29T08:56:22+05:30

‘‘కరోనా మహమ్మారిపై పోరాటం నేపథ్యంలో ప్రజలకు సమాచారాన్ని చేరవేయడం అతి ముఖ్యమైనది. దీనికోసం ప్రాణాలను ఫణంగా పెట్టి బాధ్యతాయుతమైన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ముఖ్యమంత్రికి సీపీఐ రామకృష్ణ లేఖ

అమరావతి, మార్చి 28(ఆంథ్రజ్యోతి): ‘‘కరోనా మహమ్మారిపై పోరాటం నేపథ్యంలో ప్రజలకు సమాచారాన్ని చేరవేయడం అతి ముఖ్యమైనది. దీనికోసం ప్రాణాలను ఫణంగా పెట్టి బాధ్యతాయుతమైన సేవలందిస్తున్న ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా పాత్రికేయులందరికీ నెలకు రూ.25 వేల చొప్పున ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం సీఎం జగన్‌కు ఆయనొక లేఖ రాశారు. ఈ సంక్షుభిత సమయంలో విపత్కర పరిస్థితులను అధిగమించి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పాత్రికేయులు పని చేస్తున్నారన్నారు. ప్రాణాలను లెక్క చేయకుండా పని చేస్తున్న వారికి ఒక్కొక్కరికి రూ.20 లక్షల విలువైన వైద్యంతో కూడిన జీవిత బీమా సౌకర్యం కల్పించాలని సీఎంని కోరారు. విధి నిర్వహణలో జర్నలిస్టులను ఇబ్బంది పెట్టకుండా పోలీసు, అధికారులను ఆదేశించాలని సూచించారు. పాత్రికేయులకు ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2020-03-29T08:56:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising