ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్ రాష్ట్రానికి చెడ్డపేరు తెస్తున్నారు: మస్తాన్ వలి

ABN, First Publish Date - 2020-05-29T22:37:31+05:30

సీఎం జగన్ రాష్ట్రానికి చెడ్డపేరు తెస్తున్నారు: మస్తాన్ వలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఎపీ ప్రభుత్వం నియంత్రుత్వ ధోరణితో ఎన్నికల కమిషనర్ ను తొలగించడాన్ని కాంగ్రెస్ ఆ రోజే ఖండించిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, సీఎం అవగాహన లేమి నిర్ణయాలతో రాష్ట్రానికి చెడ్డపేరు తెస్తున్నారని మస్తాన్ వలి విమర్శించారు. ఎన్నికల నామినేషన్ల సమయంలో వైసీపీ దాడులకు పాల్పడిందని మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోవిడ్ పరిస్థితిలో ఎన్నికలు వాయిదా వేశారని చెప్పారు. ఎన్నికల కమిషనర్ పదవి కాలం తగ్గించడం చరిత్రలో లేదని, లాక్ డౌన్ అమలౌతున్నా 619జీఓ ద్వారా రెండు గంటల్లో కనగరాజును నియమించారని మస్తాన్ వలి ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేష్ కుమార్ ను తొలగించడాన్ని కనగరాజును నియమించాన్ని మొదటి నుంచి ప్రశ్నించామని, ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిబంధనలు కాపాడేందుకు హైకోర్టులో పిటిషన్ వేశామని చెప్పారు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ఇది కాంగ్రెస్ విజయంగా భావిస్తున్నామని చెప్పారు. హైకోర్టు తీర్పుపై తెలుగు ప్రజలకు సమాధానం  చెప్పాల్సిన అవసరం ఉందని మస్తాన్ వలి అన్నారు.

Updated Date - 2020-05-29T22:37:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising