ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరంపై ప్రధానికి సీఎం జగన్ లేఖ

ABN, First Publish Date - 2020-10-31T22:04:16+05:30

పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయానికి కేంద్రం భారీ కోత విధించడం... తాజాగా లెక్కలు చెబితేనే మిగతా రూ.9,288 కోట్లు చెల్లిస్తామని కేంద్రం తేల్చి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్రం షాక్‌ల మీద షాక్‌లు ఇవ్వడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయానికి కేంద్రం భారీ కోత విధించడం... తాజాగా లెక్కలు చెబితేనే మిగతా రూ.9,288 కోట్లు చెల్లిస్తామని కేంద్రం తేల్చి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్రం షాక్‌ల మీద షాక్‌లు ఇవ్వడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. ప్రధాని మోదీకి లేఖ రాశారు.


మోదీ, ఆర్థిక, జలశక్తి మంత్రులకు..

పోలవరంపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. ప్రధానితో పాటు ఆర్థిక, జలశక్తి మంత్రులకు లేఖ రాశారు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని గుర్తుచేశారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటిదని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సమస్యలపై కూడా కేంద్రం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. నిధుల విడుదల జాప్యం, పనులు ఆలస్యంతో  అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందని లేఖలో సీఎం జగన్ స్పష్టం చేశారు.
































Updated Date - 2020-10-31T22:04:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising