ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీల అభ్యున్నతికి సీఎం ప్రాధాన్యత: ధర్మాన

ABN, First Publish Date - 2020-10-18T19:11:16+05:30

బీసీల అభ్యున్నతికి సీఎం ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని, ప్రభుత్వ పథకాలు అందేలా కార్పొరేషన్లు బాధ్యతలు తీసుకోవాలన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: బీసీల అభ్యున్నతికి సీఎం ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని, ప్రభుత్వ పథకాలు అందేలా కార్పొరేషన్లు బాధ్యతలు తీసుకోవాలన్నారు. 16 నెలల్లో బీసీలకు రూ.33,500 కోట్లు ఖర్చు చేశామని కృష్ణదాస్ పేర్కొన్నారు. బలహీనవర్గాల సంక్షేమానికి ఈ రోజు చారిత్రాత్మక రోజు అని మంత్రి వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ల ద్వారా బీసీలకు సంక్షేమ ఫలాలను సీఎం చేరువ చేశారని, బలహీన వర్గాలను గుర్తించి సీఎం పదవులు ఇస్తున్నారని వేణుగోపాల్ కొనియాడారు. బీసీలు ఆర్థికంగా ఎదగాలని సీఎం జగన్ భావించారని, ప్రతి కార్పొరేషన్‌లో మహిళలకు 50శాతం చోటు కల్పించారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు.


ఏపీలో బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది. 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పేర్లు ప్రకటించారు. 30 వేల పైబడి జనాభా కలిగిన బీసీ కులాలకు కార్పొరేషన్లలో ప్రాతినిధ్యం వహిస్తారు. పోస్టుల భర్తీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించారు.

Updated Date - 2020-10-18T19:11:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising