నంద్యాల ఎన్జీ.ఓ.కాలనీలో రెచ్చిపోయిన దొంగలు
ABN, First Publish Date - 2020-11-03T22:44:07+05:30
నంద్యాల ఎన్జీ.ఓ.కాలనీలో రెచ్చిపోయిన దొంగలు
కర్నూలు: జిల్లాలోని నంద్యాల ఎన్జీ.ఓ.కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. పట్టణానికి చెందిన ఓ మహిళ కానిస్టేబుల్ ఇంట్లో చోరికి పాల్పడ్డారు. మరో రెండు ఇండ్లలో చోరికి యత్నించారు. ఓ ఇంట్లో బంగారు, వెండి నగలతో పాటు 1.5 లక్షల నగదును అపహరించారు. జరిగిన చోరీపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2020-11-03T22:44:07+05:30 IST