ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడు పోలీసుల అదుపులో యోగ్యతాశ్రమం నిర్వాహకుడు

ABN, First Publish Date - 2020-08-09T11:46:11+05:30

నాగలాపురం మండలం రాజులకండ్రిగలోని యోగ్యతాశ్రమం నిర్వాహకుడు ప్రభును తమిళనాడు పోలీసులు శనివారం అదుపులో తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగలాపురం, ఆగస్టు 8: నాగలాపురం మండలం రాజులకండ్రిగలోని యోగ్యతాశ్రమం నిర్వాహకుడు ప్రభును తమిళనాడు పోలీసులు శనివారం అదుపులో తీసుకున్నారు. చెన్నై ఆవడికి చెందిన శ్రీనివాస్‌, తిరుమలవాయల్‌కు చెందిన వర్ష అనే యువతి రెండు రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరుమలవాయల్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజులకండ్రిగలోని ఆశ్రమంలో వారిద్దరి ఫోన్‌ సిగ్నల్స్‌ ట్రేస్‌అవుట్‌ కావడంతో పోలీసులతో పాటు యువతి తల్లితండ్రులు ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ వారిద్దరి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ప్రభును అదుపులో తీసుకుని విచారణ నిమిత్తం చెన్నైకు తీసుకెళ్లారు. అయితే ఆశ్రమానికి అలాంటి వారు ఎవరూ రాలేదని ఆశ్రమ నిర్వాహకుడు(గురూజీ) చెబుతుండగా... గురూజీ ఆశీస్సులతో తాము త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు తమ కుమార్తె తమకు ఫోన్‌ చేసి చెప్పిందని యువతి తల్లి తండ్రులు పేర్కొనడం గమనార్హం.

Updated Date - 2020-08-09T11:46:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising