ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికెన్ కర్రీ: మనవళ్లతోపాటు గోవిందమ్మ కూడా మృతి..

ABN, First Publish Date - 2020-06-25T19:45:44+05:30

మందు గుళికలు కలిపిన చికెన్‌ కూర తిని గుడిపాల మండలం ఏఎల్‌పురానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతిచెందిన విషయం విదితమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడిపాల (చిత్తూరు): మందు గుళికలు కలిపిన చికెన్‌ కూర తిని గుడిపాల మండలం ఏఎల్‌పురానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతిచెందిన విషయం విదితమే. ఈ ఘటనలో చికిత్స పొందుతూ బుధవారం వీరి అవ్వ గోవిందమ్మ కూడా మృతిచెందింది. వివరాలివీ.. తవణంపల్లె మండలం వడ్డిపల్లెకు చెందిన ధనమ్మ, రాంబాబు దంపతులకు కుమారులు రోహిత్‌(12), జీవ(9) ఉన్నారు. సెలవులు కావడంతో ఈనెల 13న పిల్లలిద్దరూ గుడిపాల మండలం ఏఎల్‌పురంలో ఉంటున్న అమ్మమ్మ గోవిందమ్మ ఇంటికి వెళ్లారు. కాగా, ఈనెల 22వతేది చికెన్‌ తినాలంటూ మనవళ్లు కోరవడంతో, కూరలో పొరపాటున ఆమె మందు గుళికలు వేసి వండింది. కూర తిన్న వెంటనే జీవ అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు రోహిత్‌ను, గోవిందమ్మను చిత్తూరు జిల్లా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో రోహిత్‌ చనిపోయాడు. అప్పటి నుంచి జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్న గోవిందమ్మ పరిస్థితీ విషమించడంతో బుధవారం మృతిచెందినట్లు గుడిపాల ఎస్‌ఐ వాసంతి పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-25T19:45:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising