ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మదనపల్లెలో కొవిడ్‌ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం

ABN, First Publish Date - 2020-08-02T10:42:44+05:30

మదనపల్లె ప్రభుత్వ జిల్లా వైద్యశాలను కొవిడ్‌ ఆస్పత్రిగా మారుస్తామని కలెక్టర్‌ భరత్‌గుప్తా పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 80 మందికి చికిత్సలు అందించేలా చర్యలు

 కలెక్టర్‌ భరత్‌గుప్తా


మదనపల్లె టౌన్‌, ఆగస్టు 1: మదనపల్లె ప్రభుత్వ జిల్లా వైద్యశాలను కొవిడ్‌ ఆస్పత్రిగా మారుస్తామని కలెక్టర్‌ భరత్‌గుప్తా పేర్కొన్నారు. శనివారం సబ్‌కలెక్టరేట్‌లో ఆర్డీవో మురళి, ఎమ్మెల్యే నవాజ్‌బాషాతో కలసి కలెక్టర్‌ పట్టణంలోని వైద్యులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రోజుకు కరోనా కేసులు 1000కి వచ్చే అవకాశం వుందని, ఇప్పుడు చిత్తూరు, తిరుపతిలో మాత్రమే కరోనా బాధితులకు చికిత్సలు అందిస్తున్నామన్నారు. అందుకే మదనపల్లె ప్రభుత్వ జిల్లా వైద్యశాలను కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చి 80-100 మందికి చికిత్సలు అందించేలా చర్యలు తీసుకుంటున్నా మన్నారు.


మదనపల్లెలో 5 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వున్నాయని, వీటిలో కూడా కరోనా బాధితులకు చికిత్సలు అందించాలని ఆదేశించామన్నారు.  ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సలు చేసేందుకు ప్రైవేటు వైద్యులు ముందుకొస్తే వారికి అర్హతబట్టి వేతనాలు అందిస్తామ న్నారు. సర్వర్‌ సమస్యతో కరోనా పరీక్ష ఫలితాలు వెల్లడించడంలో ఆలస్యమైందని, ఈ సమస్య పరిష్కరించా మన్నారు. ప్రతి పీహెచ్‌సీలో 50 యాంటిజెంట్‌ కిట్లు ఉంచామని, వీటీఎం కిట్ల కోసం తిరుపతి వెళ్లాల్సిందే అన్నారు. ప్రజలు స్వీయనియంత్రణ పాటిస్తేనే కరోనా నియంత్రణ చేయగలమని స్పష్టం చేశారు.


Updated Date - 2020-08-02T10:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising