ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయంలో ప్రసరిస్తున్న సూర్యకిరణాలు

ABN, First Publish Date - 2020-03-27T10:06:48+05:30

నాగలాపురం మండలంలోని వేదనారాయణస్వామి ఆలయంలో గురువారం సూర్య కిరణాలు మత్స్యావతారమూర్తి నాభిని తాకాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మత్స్యవతార మూర్తి నాభిని తాకిన సూర్యకిరణాలు


   నాగలాపురం, మార్చి 26: నాగలాపురం మండలంలోని వేదనారాయణస్వామి ఆలయంలో గురువారం సూర్య కిరణాలు మత్స్యావతారమూర్తి నాభిని తాకాయి. ఉదయం ఆలయ అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పరివార దేవతలకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజన సేవ చేశారు. సాయం సంధ్యవేళ ఆకాశంలోని బాణుడి కిరణాలు ప్రధాన గోపురాన్ని దాటుకొని ధ్వజస్తంభం మార్గం గుండా వేదసంరక్షకుడి నాభిని తాకాయి. ఈ సుందర దృశ్యాన్ని తిలకించిన వేదపండితులు, ఆలయాధికారులు గోవింద నామ స్మరణలను స్మరిస్తూ భక్తి ప్రపత్తులతో పరవశించి పోయారు. అనంతరం  ఆలయ పరిచారకులు సూర్య కిరణాలు ప్రచురించిన మార్గంలో పుణ్య జలాన్ని చిలకరించారు. సూర్యపూజ దర్శనాంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను  సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి అలంకరణలో అలంకరించి దీప, ధూప నైవేద్యాలు సమర్పించారు. 

Updated Date - 2020-03-27T10:06:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising