ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో రెండు కేసులు

ABN, First Publish Date - 2020-06-02T09:41:36+05:30

జిల్లాలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం సాయంత్రం వరకూ పుత్తూరులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

286కు చేరిన పాజిటివ్‌ల సంఖ్య

యాక్టివ్‌ కేసులు 87


తిరుపతి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం సాయంత్రం వరకూ పుత్తూరులో మూడు, శ్రీకాళహస్తి, కేవీబీపురాల్లో ఒక్కొక్కటి చొప్పున ఐదు కేసులను స్విమ్స్‌ ల్యాబ్‌ నిర్ధారించగా సాయంత్రం తర్వాత పుత్తూరు, నిండ్ర మండలాల్లో రెండు కేసులు వెలుగు చూశాయి. దీంతో ఆదివారం మొత్తం ఏడు కేసులు నమోదైనట్టయింది. చివరి రెండు కేసుల్లో పుత్తూరు మండలానికి చెందిన 12 ఏళ్ళ బాలిక, నిండ్ర మండలానికి చెందిన 45 ఏళ్ళ మహిళ వున్నారు.


వీరిద్దరూ కూడా ముంబై నుంచీ వచ్చిన వలస కార్మికుల కుటుంబీకులుగా అధికారులు గుర్తించారు. వీరితో కలిపి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 286కు చేరుకోగా వీరిలో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే.197 మంది కరోనా వైరస్‌ నుంచీ కోలుకుని ఆస్పత్రుల నుంచీ డిశ్చార్జి కాగా 87 మంది  ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.సోమవారం సాయంత్రం వరకూ జిల్లాలో కరోనా కేసులేవీ నమోదు కాలేదు. చాలా రోజుల తర్వాత ఇలా 12 గంటలకు మించి కేసులేవీ నమోదు కాకపోవడం ఇదే ప్రథమం.

Updated Date - 2020-06-02T09:41:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising