ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్టు

ABN, First Publish Date - 2020-10-25T10:54:26+05:30

తిరుపతిలో ఐపీఎల్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు యువకులను స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రూ.లక్ష, రెండు ద్విచక్ర వాహనాల స్వాధీనం

జూదం ఆడినా, ఆడించినా ఉపేక్షించం: ఎస్పీ 


తిరుపతి (నేరవిభాగం), అక్టోబరు 24: తిరుపతిలో ఐపీఎల్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు యువకులను స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.లక్ష స్వాధీనం చేసుకున్నారు. అర్బన్‌జిల్లా ఎస్పీ రమేష్‌రెడ్డి మీడియాకు వివరాలు తెలియజేశారు. నగరంలో కొందరు ఐపీఎల్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్టు ఎస్పీకి సమాచారం అందింది. ఆయన ఆదేశాలతో ఎస్బీ డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి, ఎస్‌ఐ నాగేంద్రబాబు, ఇతర సిబ్బంది నిఘా పెట్టారు. ఎస్‌.కె.షమీర్‌బాషా (33), పఠాన్‌ యూసఫ్‌ఖాన్‌ (29)లు సెల్‌ఫోన్‌ ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు గుర్తించి టీవీఎస్‌ కూడలి వద్ద అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బెట్టింగ్‌కు సంబంధించిన రూ.లక్షను, రెండు ద్విచక్ర వాహనాలను, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జూదం ఆడినా, ఆడించినా ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. ఎంతటివారైనా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. జూదం, అసాంఘిక కార్యక్రమాలపై సమాచారం తెలిస్తే.. పోలీసులకు తెలియజేయాలని ప్రజలను ఎస్పీ కోరారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. 

Updated Date - 2020-10-25T10:54:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising