ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు టీటీడీ బోర్డు సమావేశం.. దర్శన విధివిధానాలపైనే చర్చ

ABN, First Publish Date - 2020-07-04T20:47:00+05:30

నేడు టీటీడీ బోర్డు సమావేశం.. దర్శన విధివిధానాలపైనే చర్చ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం


తిరుమల (ఆంధ్రజ్యోతి): టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరగనుంది. లాక్‌డౌన్‌ సడలించాక ప్రస్తుతం రోజుకు 12 వేల మందికి దర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతుండటం.. టీటీడీ ఉద్యోగుల్లోనూ కొందరికి పాజిటివ్‌ వచ్చింది. ఇక, దర్శనాలు మొదలైన ఈ 22 రోజుల్లో భక్తులకు తలెత్తిన సమస్యలు, వాటి పరిష్కారం, తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తలు, చేయాల్సిన ఏర్పాట్లు తదితరాలపై టీటీడీ బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. 


మరోవైపు దర్శనాల సంఖ్య పెంచాలనే ఒత్తిడి ఉన్నప్పటికీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో పెంచకూడదనే టీటీడీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో దర్శన విధివిధానాలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగనుంది. ఇక, రెండు నెలల క్రితం శ్రీవారి ఆస్తుల వేలంపై టీటీడీ బోర్డుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో టీటీడీ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. గతంలో వివిధ దశల్లో విక్రయించినవి, ఆక్రమణకు గురైనవి, అందుబాటులో ఉన్న ఆస్తుల సమాచారంతో రూపొందిన శ్వేతపత్రాన్ని విడుదల చేసే అవకాశముంది. కరోనా నేపథ్యంలో చైర్మన్‌, ఈవో, స్థానిక సభ్యులు మాత్రమే తిరుమలలోని అన్నమయ్య భవనంలోను, ఇతర ప్రాంతాల్లోని సభ్యులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొననున్నారు. 


Updated Date - 2020-07-04T20:47:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising