ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరానికి నిధులు తేలేని

ABN, First Publish Date - 2020-10-30T11:47:54+05:30

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు తేలేని వైసీపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాస రెడ్డి డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి

- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి


మదనపల్లె టౌన్‌, అక్టోబరు 29: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు తేలేని వైసీపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాస రెడ్డి డిమాండ్‌  చేశారు. గురువారం సాయంత్రం ఆయన స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోలవరం ఆలస్యమైతే రాయల సీమకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తికి ఏడాదిన్నరలో వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదన్నారు.  రైతుల కన్నీళ్లు తుడుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభు త్వం.. అన్నదాతలకు సంకెళ్లు వేయడం నియంత పాలన కాదా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ మాట్లాడుతూ హంద్రీ నీవా కాలువ నీటి కోసం టీడీపీ నాయకులు పాదయాత్ర చేస్తుంటే.. ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందన్నారు. మదనపల్లెలో చిప్పిలి ఎస్‌ఎస్‌ ట్యాంకును కొందరు గండి కొట్టినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. కార్యక్రమంలో దొమ్మలపాటి యశస్విరాజ్‌, టీడీపీ రాజంపేట పార్లమెంటరీ మహిళా విభాగం కార్యదర్శి ఎ.విజయ, నాయకులు వై.దొరస్వామినా యుడు, నీలకంఠ, సహజీవన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T11:47:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising