ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గందరగోళంగా టీచర్ల సీనియారిటీ జాబితా

ABN, First Publish Date - 2020-10-29T08:35:15+05:30

గందరగోళంగా టీచర్ల పదోన్నతుల జాబితా ఉందంటూ ఎస్టీయూ నాయకులు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు(సెంట్రల్‌), అక్టోబరు 28: గందరగోళంగా టీచర్ల పదోన్నతుల జాబితా ఉందంటూ ఎస్టీయూ నాయకులు పేర్కొన్నారు. బుధవారం ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్‌రెడ్డి, నాయకులు గంటా మోహన్‌, రమేష్‌, నరసింహులు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో నరసింహారెడ్డిని కలసి సమస్యలను విన్నవించారు. పదోన్నతి జాబితాలో చోటుచేసుకున్న పరిణామాలతో పలువురు టీచర్లు కౌన్సెలింగ్‌కు హాజరు కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే పదోన్నతి పేరిట అధికారులు ధ్రువపత్రాలిచ్చి ఏ ప్రాంతాలకు బదిలీ చేస్తామన్న విషయమై స్పష్టత ఇవ్వడం లేదన్నారు. దీంతో అధికశాతం నాట్‌విల్లింగ్‌ ఇవ్వడంతో మిగిలిన టీచర్లు ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రయోజనం కలిగేలా రేషనలైజేషన్‌ నిబంధనలు అమలు చేయాలని సూచించారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాల్సి ఉందని గుర్తుచేశారు. స్పందించిన డీఈవో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2020-10-29T08:35:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising