ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

32 ఎర్రచందనం దుంగల స్వాధీనం

ABN, First Publish Date - 2020-10-28T11:08:53+05:30

చామల రేంజ్‌ పరిధిలోని తలకోన అడవుల్లో అటవీశాఖ అధికారులు నిర్వహించిన కూంబింగ్‌లో 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్‌


భాకరాపేట, అక్టోబరు 27: చామల రేంజ్‌ పరిధిలోని తలకోన అడవుల్లో అటవీశాఖ అధికారులు నిర్వహించిన కూంబింగ్‌లో 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. ఎఫ్‌ఆర్వో పట్టాభికి అందిన సమాచారం మేరకు తన సిబ్బందితో సోమవారం రాత్రి ఆయన తలకోన అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టారు. రాత్రి 11 గంటల సమయంలో నిమ్మకాయల బండ వద్ద కొందరు స్మగ్లర్లు దుంగలను మోసుకొస్తూ కూంబింగ్‌ బృందానికి తారసపడ్డారు. వారిపై అటవీశాఖ అధికారులు దాడులు చేయగా దుంగలను పడేసి పరారయ్యారు. వారిని వెంబడించి ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారు తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాకు చెందిన దేవదాసు, రాజశేఖరన్‌గా విచారణలో తేలింది. పట్టుబడిన దుంగలు రూ.ఆరు లక్షలు ఉంటుందని అంచనా. ఈ దాడుల్లో ఎఫ్‌ఎస్వో నాగరాజు, ఎఫ్‌బీవోలు వందన్‌కుమార్‌, వినోద్‌కుమార్‌, చెంగల్రాయుడు, వరదరాజులు, బేస్‌క్యాంప్‌, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-28T11:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising