9 నుంచి ఎస్వీయూ పీజీ ప్రవేశ పరీక్షలు
ABN, First Publish Date - 2020-10-01T10:27:23+05:30
ఎస్వీయూ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి అక్టోబరు 9 నుంచి ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజూ ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు.. 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మూడు దశల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), సెప్టెంబరు 30: ఎస్వీయూ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి అక్టోబరు 9 నుంచి ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజూ ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు.. 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మూడు దశల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
9న మైక్రో బయాలజీ, ఫుడ్ టెక్నాలజీ, అక్వాకల్చర్, ఎకనమిక్స్, 10న స్టాటిస్టిక్స్, ఎలకా్ట్రనిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బోటనీ పరీక్షలు నిర్వహిస్తారు. 11న బయో కెమిస్ట్రీ, హిస్టరీ, ఇంగ్లీష్, తెలుగు, 12న మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయో టెక్నాలజీ, 13న కెమిస్ట్రీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, 14న జువాలజీ, జనరల్ టెస్ట్, ఎంపీఈడీ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు మాస్క్, శానిటైజర్‌ను వెంట తెచ్చుకోవాలని వర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ (డీవోఏ) డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ సబ్జెక్టులకు నో ఎంట్రెన్స్
ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జాగ్రఫీ, జియాలజీ, హిందీ, సీప్ స్టడీస్, హోం సైన్స్, హైడ్రో జియాలజీ, ఫర్మార్మింగ్ ఆర్ట్స్, పాపులేషన్ స్టడీస్, సైకాలజీ, సంస్కృతం, సోషియల్ వర్క్, సోషియాలజీ, తమిళం, ఉర్దూ, టూరిజం సబ్జెక్టులను ప్రవేశ పరీక్ష నుంచి మినహాయించారు. ఈ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్న వారు నేరుగా కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు.
Updated Date - 2020-10-01T10:27:23+05:30 IST