ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నియంత్రణ చర్యల్లో తిరుపతికి ఫస్ట్‌ ర్యాంక్‌

ABN, First Publish Date - 2020-03-31T12:22:18+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలకు స్మార్ట్‌సిటీ మిషన్‌ ప్రకటించిన ర్యాంకుల్లో తిరుపతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, మార్చి30 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలకు స్మార్ట్‌సిటీ మిషన్‌ ప్రకటించిన ర్యాంకుల్లో తిరుపతి మొదటి స్థానం సాధించింది. రాష్ట్రంలోని మిగిలిన పట్టణాలతో పోలిస్తే స్మార్ట్‌సిటీల్లో వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యలు బాగున్నాయని స్మార్ట్‌సిటీ మిషన్‌ తన నివేదికలో కితాబునిచ్చింది.


అందులోనూ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కరోనా నియంత్రణ చర్యలు అద్భుతంగా ఉన్నట్లు పేర్కొంది. స్మార్ట్‌ నగరాల పనితీరును బట్టి మూడు గ్రేడ్‌లుగా విభజించి అక్కడి సేవలను పరిశీలించి స్మార్ట్‌సిటీ మిషన్‌ ర్యాంకులు ప్రకటించింది. రాష్ట్రంలో విశాఖపట్నం, అమరావతి, కాకినాడ, తిరుపతి.. నాలుగు స్మార్ట్‌సిటీలు ఉండగా ఇందులో తిరుపతికి మొదటి ర్యాంక్‌ వచ్చింది. తిరుపతికి విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ఇళ్ల వద్ద పక్కాగా మార్కింగ్‌ వేశారని, వారిపై ‘క్వారంటైన్‌’ పర్యవేక్షణ బాగుందని కితాబిచ్చింది. అలాగే ఇంటింటికి వెళ్లి నిత్యావసరాలు, సరుకులు అందజేస్తున్నారని పేర్కొంది. 

Updated Date - 2020-03-31T12:22:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising