ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో అంతర్రాష్ట్ర పర్యాటక ప్యాకేజీలు

ABN, First Publish Date - 2020-09-14T09:54:19+05:30

తిరుపతి నుంచి త్వరలో అంతర్రాష్ట్ర పర్యాటకశాఖ ప్యాకేజీలు ప్రారంభించనున్నట్లు టూరిజం తిరుపతి డీవీఎం సురేష్‌కుమార్‌రెడ్డి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవిడ్‌ బాధితులకు టూరిజం సేవలు

తిరుపతి డీవీఎం సురేష్‌కుమార్‌రెడ్డి


బి.కొత్తకోట, సెప్టెంబరు 13: తిరుపతి నుంచి త్వరలో అంతర్రాష్ట్ర పర్యాటకశాఖ ప్యాకేజీలు ప్రారంభించనున్నట్లు టూరిజం తిరుపతి డీవీఎం సురేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన హార్సిలీహిల్స్‌లో మీడియాతో మాట్లాడుతూ కరోనాతో పర్యాటకశాఖ కుదేలు అయిందని, ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి తమ సంస్థ కుదుట పడుతోందన్నారు.


తిరుపతిలో కరోనా బాధితులకు భోజన వసతి టీటీడీతోపాటు రెవెన్యూ అధికారులు కల్పిస్తుండగా తమ సిబ్బంది వంటలు వండి ప్యాకింగ్‌ చేసి వాటిని కోవిడ్‌ కేంద్రాలకు సరఫరా చేస్తున్నందుకు ఒక్కో బాధితుడికి రూ.65చొప్పున సేవా రుసుం పొందుతున్నామని చెప్పారు. గత నెల సేవా రుసుం కింద రూ.20లక్షలు ఆదాయం వచ్చిందన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఎత్తివేసిన నేపథ్యంలో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు అంతర్రాష్ట్ర ప్యాకేజీలను తిరుపతి పర్యాటక శాఖ ప్రారంభించేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు ఆయన తెలిపారు. హార్సిలీహిల్స్‌లోనూ పర్యాటకుల సంఖ్య పెరుగుతుండడంతో గత మాసం సుమారు రూ.15లక్షలు ఆదాయం లభించిందని ఆయన చెప్పారు. ఆయన వెంట మేనేజర్‌ సాల్విన్‌రెడ్డి వున్నారు. 

Updated Date - 2020-09-14T09:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising