టిడ్కో ఇళ్లను పేదలకు అందించాలి
ABN, First Publish Date - 2020-07-08T11:29:41+05:30
టిడ్కో ఇళ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ డిమాండ్ చేశారు. ఆరోగ్యవరం సమీపంలో నిర్మించిన టిడ్కో
మదనపల్లె టౌన్, జూలై 7 : టిడ్కో ఇళ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ డిమాండ్ చేశారు. ఆరోగ్యవరం సమీపంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల వద్ద రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఇళ్ల స్థలాల సేకరణ, చదును చేయడంలో మదనపల్లె నాయకులు చేతివాటం ప్రదర్శించి దొంగ బిల్లులు చేసుకుంటున్నారని ఆరోపించారు. రాటకొండ మధుబాబు, భవానీప్రసాద్, ఆర్‌జే వెంకటే్‌ష్, పఠాన్ ఖాదర్‌ఖాన్, పూల మురళి, సిద్దప్ప, నీలకంఠ, వి.వెంకటేష్, ప్రభాకర్, ఉషారాణి, విజయ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-07-08T11:29:41+05:30 IST