దోచేశారు!
ABN, First Publish Date - 2020-11-13T07:19:41+05:30
తిరుపతిలో నయా చోరీ జరిగింది.
తిరుపతిలో నయా చోరీ ముఠా
రూ.ఒకటిన్నర లక్ష అపహరణ
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 12: తిరుపతిలో నయా చోరీ జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. లీలామహల్ కూడలిలో లక్ష్మీవెంకటేశ్వర స్టీల్స్ దుకాణాన్ని నగరానికి చెందిన ఎస్.ప్రకాష్ నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో ఇద్దరు మహిళలు ఏడేళ్ల చిన్నారితో దుకాణానికి వచ్చారు. ఆకలేస్తోంది, దానం చెయ్యమని అక్కడున్న గుమస్తాను అభ్యర్థించారు. చిన్నారికి దాహమేస్తోంది.. కనీసం నీళ్లన్నా ఇవ్వమంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్‌ను అందుకనే నెపంతో మరింత దగ్గరకు వచ్చి.. ఆయన్ను మాటల్లో పెట్టారు. తమ వెనుకవైపు పరిసరాలు గుమస్తానకు కనపడకుండా చుట్టుముట్టేశారు. దీన్ని అదనుగా చేసుకున్న ఏడేళ్ల చిన్నారి పక్కనే ఉన్న టేబుల్ సొరుగును తెరిచి అందులోని రూ.1.50 లక్షలను కొట్టేసింది. పనయ్యాక అందరూ వెళ్లిపోయారు. కొంతసేపటికి వచ్చిన యజమాని ప్రకాష్ ఈ చోరీ విషయాన్ని గుర్తించారు. దీనిపై శుక్రవారం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన చెప్పారు.
Updated Date - 2020-11-13T07:19:41+05:30 IST