ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు దివాల.. కూలీల దిగాలు!

ABN, First Publish Date - 2020-03-31T12:26:54+05:30

చెమటోడ్చి పండించిన పంట చేతికొచ్చినా.. అమ్ముకోవడానికి రైతుకు పోలీసు నిబంధనలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా ని‘బంధన’లనే కారణం

ప్రభుత్వ సిబ్బందిని సద్వినియోగం చేసుకుంటే సమస్యను అధిగమించొచ్చు


చిత్తూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): చెమటోడ్చి పండించిన పంట చేతికొచ్చినా.. అమ్ముకోవడానికి రైతుకు పోలీసు నిబంధనలు మోకాళ్లడ్డుతున్నాయి. మరోవైపు అధిక ధరలతో వినియోగదారులు అల్లాడుతున్న విచిత్ర పరిస్థితి. ఇక పనులు దొరక్క కూలీలు పస్తులుండాల్సిన దయనీయం. కరోనా నివారణ, అనుమానితుల గుర్తింపు.. క్వారంటైన్‌లకు తరలింపు, లాక్‌డౌన్‌ నిబంధనల అమలులోనే అన్ని శాఖలు తలమునకలయ్యాయి. అయితే.. లాక్‌డౌన్‌ వల్ల వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని నివారించడానికి సమన్వయం పెరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందిని ఉపయోగించుకుని కార్యాచరణ రూపొందిస్తే.. సత్ఫలితాలు వస్తాయి.


జిల్లాలోని వ్యవసాయ శాఖలో అధికారులతో సహా 500 మంది, ఉద్యానశాఖలో 23 మంది పనిచేస్తున్నారు. వీరితోపాటు సచివాలయాల్లో మరో వెయ్యి మంది అగ్రికల్చర్‌ , హార్టికల్చర్‌ అసిస్టెంట్లు ఉన్నారు. వీరికి క్షేత్రస్థాయిలో రైతులు పండిస్తున్న పంటలు, కూరగాయలు, ఆకుకూరల లభ్యతపై సంపూర్ణ అవగాహన ఉంటుంది. వీరి ద్వారా రైతు నుంచి ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేస్తే రైతుకు రవాణా వ్యయంతోపాటు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు తప్పుతాయి. వీటిని సేకరించి వాహనాల ద్వారా పట్టణాల్లో ఇటీవల ఏర్పాటుచేసిన రైతు బజార్లకు తరలించి నిత్యావసరాల కొరతను నివారించవచ్చు. దీంతో రైతు, రైతు కూలీలకు గిట్టుబాటు దక్కుతుంది. జిల్లాలో రైతులు, రైతు కూలీలతో ప్రత్యక్ష పరిచయాలున్న ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఈసీ, ఏపీవో తదితర ఉపాధిహామీ పథకం సిబ్బంది రెండువేల మంది ఉన్నారు. ఉపాధి కూలీలకు లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి పనులు దొరక్క తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


వీరికి ఉపాధి చూపుతూ.. వారి సేవలను వినియోగించుకోవడంలో ఉపాధి సిబ్బంది కీలకపాత్ర పోషించవచ్చు. పంచాయతీల్లో గ్రామాల స్థితిగతులపైన పూర్తి అవగాహన కలిగిన పంచాయతీ కార్యదర్శులు వెయ్యి మందికిపైగా ఉన్నారు. పర్యవేక్షణా సమన్వయానికి వీరిని వినియోగించుకుంటే సరిపోతుంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చే ఉపాధ్యాయుల సేవలను అవసరమైనచోట వినియోగించుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వారందరికీ మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచి తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. 

Updated Date - 2020-03-31T12:26:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising