ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హౌసింగ్‌కు అంగన్‌వాడీ భవన నిర్మాణాల పర్యవేక్షణ

ABN, First Publish Date - 2020-10-23T10:55:01+05:30

అంగన్‌వాడీ భవన నిర్మాణాల పర్యవేక్షణను గృహ నిర్మాణ (హౌసింగ్‌)శాఖకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నేడో, రేపో అధికారిక ఉత్తర్వుల జారీ


చిత్తూరు అర్బన్‌, అక్టోబరు 22: అంగన్‌వాడీ భవన నిర్మాణాల పర్యవేక్షణను గృహ నిర్మాణ (హౌసింగ్‌)శాఖకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ప్రక్రియ పూర్తిచేయాలని మౌఖిక ఆదేశాలందాయి. నేడు, రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. జిల్లాలో 4,768 అంగన్‌వాడీ కేంద్రాలుండగా 768 చోట్ల సొంత భవనాల్లేవు. టీడీపీ పాలనలో ఉపాధి హామీ పథకం నిధులతో 501 భవనాలను నిర్మించడానికి అనుమతినిచ్చి, నిర్మాణ పనులను పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించారు. వీటిల్లో 412 భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడం, రెవెన్యూ అధికారులు స్థలాలు సమయానికి కేటాయించక పోవడం వంటి కారణాలతో కొన్ని పునాదులతోనే ఆగిపోగా.. మరికొన్ని వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. కేవలం 89 భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కడెక్కడ భవనాల నిర్మాణం చేపట్టాలి, ఏయేవి నిర్మాణ దశల్లో ఉన్నాయో సేకరించే పనిలో అధికారులున్నారు. ఇదిలా ఉంటే.. కొన్నిచోట్ల పునాదులు సరిగా లేవని.. అలాంటి చోట్ల మొదటి నుంచి నిర్మాణం చేపట్టాలే నివేదిక సిద్ధం చేస్తున్నారు. 


Updated Date - 2020-10-23T10:55:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising