ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన సుగుటూరు గంగజాతర

ABN, First Publish Date - 2020-03-20T10:51:14+05:30

పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర గురువారం ఉదయం నిమజ్జనంతో ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఘనంగా అమ్మవార్ల ఊరేగింపు

ప్యాలెస్‌కు చేరిన అమ్మవారు


పుంగనూరు, మార్చి 19: పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర గురువారం ఉదయం నిమజ్జనంతో ముగిసింది. మంగళవారం జమీందారుల తొలిపూజతో ప్రారంభమైన జాతర రాత్రి ఊరేగింపు అనంతరం బుధవారం ప్యాలెస్‌ ఆవరణలో అమ్మవారిని ప్రతిష్టించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పుంగనూరు పరిసర ప్రాంతాల భక్తులు వివిధ రకాల వేషధారణతో గెరిగెలు మోస్తూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ముస్లింలు, క్రైస్తవులు సైతం గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం మతసామరస్యానికి ఇక్కడ నిదర్శనం. బుధవారం  అర్ధరాత్రి గంగమ్మను ఆలయం నుంచి  వెలుపలకు తెచ్చి నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకెళుతుండగా బజారువీధిలోని నడివీధి గంగమ్మ, మైసూర్‌బ్యాంకు వద్ద కొలువుదీరిన మల్లారమ్మ కలిశారు.  గంగమ్మలు సుబేదార్‌వీధి, తేరువీధి మీదుగా తూర్పుమొగసాలలోని చౌడేశ్వరిదేవి ఆలయం వరకు మంగళవాయిధ్యాలు, బాణసంచా పేలుళ్లు, అసాధివారి కథలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు.  ముగ్గురు గంగమ్మలను భక్తులు ఆనందోత్సాహలు, మంగళవాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు.


స్థానిక చాముండేశ్వరిదేవి ఆలయానికి మల్లారమ్మ వెళ్లి అమ్మవారిని పలకరించి వెనుదిరిగారు. అమ్మవారికి ఎనుపోతును బలిఇచ్చి తోటి కులస్తులు  ఆ తలను చాటలో పెట్టుకుని తీసుకెళ్లారు. సుగుటూరు గంగమ్మ, నడివీధి గంగమ్మలు చాముండేశ్వరి గుడి ఎదురుగా ఉన్న కోనేరులో నీరు లేకపోవడంతో ఆ ప్రాంతంలో డ్రమ్ముల్లోని నీటితో  నిమజ్జన కార్యక్రమాన్ని గూడూరుపల్లె పూజారులు పూర్తి చేశారు. నిమజ్జన కార్యక్రమం ముగియగానే సుగుటూరు గంగమ్మ విగ్రహాన్ని ఎవరికీ కనిపించనీయకుండా వస్ర్తాలతో చుట్టి ప్యాలెస్‌కు తీసుకొచ్చి భద్రపరిచారు. అలాగే అమ్మవారి శిరస్సు రంగారెడ్డి ఇంటికి, నడివీధి గంగమ్మ బజారువీధికి వెళ్లాయి.  ప్యాలెస్‌లో పూజారులు అమ్మవారికి అలంకరించిన ఆభరణాలను జమీందార్లకు అప్పగించి పూజలు చేశారు. అనంతరం జమీందార్ల మలి పూజతో సుగుటూరు గంగమ్మ ప్యాలెస్‌ గృహ నిర్బంధంలోకి వెళ్లడంతో  రెండు రోజులుగా జరిగిన జాతర గురువారం ఉదయంతో ముగిసింది. నిమజ్జనానికి మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ, సీఐ గంగిరెడ్డి, ఎస్‌ఐలు తిప్పేస్వామి, ఉమామహేశ్వర రావులు హాజరై ఏర్పాట్లు పర్యవేక్షించారు. అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించిన సుగుటూరు గంగమ్మ సేవా సంఘ సభ్యులను జమీందారు కుటుంబ సభ్యులు, అధికారులు అభినందించారు.

Updated Date - 2020-03-20T10:51:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising