ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు మానుకోండి

ABN, First Publish Date - 2020-12-30T05:00:27+05:30

ప్రతిపక్షాలు చేసే విమర్శల్లోని సానుకూల అంశాలను తీసుకుని సమస్యలను పరిష్కరించకుండా బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేయడం అధికార పార్టీకి తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో హితవు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ


పుత్తూరు, డిసెంబరు 29: ప్రతిపక్షాలు చేసే విమర్శల్లోని సానుకూల  అంశాలను తీసుకుని సమస్యలను పరిష్కరించకుండా బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేయడం అధికార పార్టీకి తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో హితవు పలికారు. జగన్‌ భవనాల్లో కుక్కలకు కేటాయించే స్థలం కంటే తక్కువ స్థలాన్ని పేదలకు ఇచ్చి ప్రచార ఆర్భాటం చేయడం తగదని తాను సహేతుక విమర్శ చేసింది వాస్తవమేనన్నారు. తన విమర్శలో తక్కువ స్థలం అంశం తీసుకుని పేదలకు న్యాయం చేయకుండా ఉపమానానికి పెడార్థాలు తీసి కులం రంగు పూసి బ్లాక్‌ మెయిల్‌ చేయడం ఏమిటని ప్రశ్నించారు. గతంతో వైఎస్‌కు మద్దతు పలికినప్పుడు కనబడని కులం నేడు కన్పించిందా అని వైసీపీని ప్రశ్నించారు. అవకాశవాదంతో పార్టీలు మారకుండా సిద్ధాంత రాజకీయాలు చేస్తున్నానని నారాయణ అన్నారు. 

Updated Date - 2020-12-30T05:00:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising