నేటి నుంచి ధనుర్మాస పూజలు
ABN, First Publish Date - 2020-12-16T02:19:02+05:30
శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం నుంచి ధనుర్మాస పూజలు ప్రారంభిస్తున్నారు.
ముక్కంటి ఆలయ సేవల్లో మార్పులు
శ్రీకాళహస్తి, డిసెంబరు 15: శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం నుంచి ధనుర్మాస పూజలు ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో సేవల్లో కూడా మార్పులు చేశారు. వచ్చే నెల 13వ తేదీ వరకు ఇవి కొనసాగిస్తారు. ప్రతి రోజు వేకువజామున 3 గంటలకు పుర వీధుల్లోకి జేగంట పంపుట, 4 గంటలకు మంగళవాయిద్యాలు, 4.15 గంటలకు తిరుమంజనం, 4.30 గంటలకు గోపూజ, పళ్లియర పూజ(సుప్రభాతం లేదు), 5 గంటలకు ప్రథమకాల అభిషేకం (సేవలు లేవు), ఉదయం 7 గంటలకు పరివార దేవత నైవేద్యం, 7.30 గంటలకు గొబ్బి ఉత్సవం (ఏకాంతం), 10.30 గంటలకు ఉచ్చికాల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ప్రదోషకాల అభిషేకం ఉంటాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం రోజుల్లో రాత్రి 9 గంటలకు, మంగళ, బుధ, గురువారం రోజుల్లో రాత్రి 8.30 గంటలకు పళ్లియర పూజ నిర్వహించనున్నారు.
Updated Date - 2020-12-16T02:19:02+05:30 IST