మద్యంషాపులను మూసేయండి..తెలుగు మహిళల వినతి
ABN, First Publish Date - 2020-05-09T09:02:03+05:30
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం మద్యం షాపులు తెరవటం సిగ్గు
తిరుపతి (యశోదనగర్)/ చంద్రగిరి, మే 8: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం మద్యం షాపులు తెరవటం సిగ్గు చేటని తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే షాపులను మూసేయాలంటూ శుక్రవారం రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. తిరుపతి అర్బన్ డిప్యూటీ తహసీల్దార్ వెంకటరమణకు తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి, నగర అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ, టీఎన్‌టీయూసీ కార్యదర్శి నాగమణి తదితరులు వినతిపత్రం అందజేశారు. చంద్రగిరిలో కొటాల మాజీ సర్పంచ్ శింగు సుధా, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు అమ్ములు, సుశీలమ్మ ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్ చంద్రమోహన్‌కు వినతి పత్రం అందజేశారు. పాకాల మండలంలో మాజీ ఎంపీపీ చాముండేశ్వరి, నాయకులు సావిత్రి, ప్రియాంక, హిమబిందు, మేరి, రేణుక ఆధ్వర్యంలో, తిరుపతి రూరల్ మండలంలో నాయకురాళ్లు హేమలత, రామేశ్వరి, కవిత, పూర్ణిమ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలిచ్చారు.
Updated Date - 2020-05-09T09:02:03+05:30 IST