ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోపిడీ చేసిన లారీ బోల్తా: దొంగల పరారీ

ABN, First Publish Date - 2020-09-14T09:56:03+05:30

ఆర్టీవో అధికారులమంటూ దుండగులు బెదిరించి టమోటా లారీని దొంగతనంగా తీసుకెళ్తుండగా.. ఆ వాహనం అదుపుతప్పి బోల్తా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుంగనూరు రూరల్‌, సెప్టెంబరు 13: ఆర్టీవో అధికారులమంటూ దుండగులు బెదిరించి టమోటా లారీని దొంగతనంగా తీసుకెళ్తుండగా.. ఆ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దొంగలు వాహనాన్ని వదిలి పారిపోయారు.  రొంపిచెర్ల మండలానికి చెందిన వేణుగోపాల్‌ ఆదివారం తన లారీలో పుంగనూరు నుంచి టమోటాలోడుతో చెన్నైలోని కోయంబేడుకు బయలుదేరాడు. పలమనేరు రోడ్డులోని రిలయన్స్‌ పెట్రోలుబంక్‌ వద్ద ముగ్గురు దుండగులు ఆర్టీవో అధికారులమంటూ లారీని నిలిపారు. తర్వాత కత్తులు చూపి బెదిరించి లారీని ఏ.కొత్తకోట వైపు తీసుకెళ్లారు. ఈ విషయమై వేణుగోపాల్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అప్రమత్తం అయ్యేలోగానే టమోటాల లోడు లారీ బోల్తాపడినట్లు సమాచారం అందింది. దొంగలు ప్రమాదం జరిగిన వెంటనే పరారయ్యారు. సీఐ గంగిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-09-14T09:56:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising