ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీడీల పదోన్నతుల అవకతవకలపై ఆర్జేడీ విచారణ

ABN, First Publish Date - 2020-09-20T11:01:51+05:30

జిల్లా విద్యాశాఖలో పీడీల పదోన్నతులకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు సెంట్రల్‌, సెప్టెంబరు 19: జిల్లా విద్యాశాఖలో పీడీల పదోన్నతులకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. దీంతో శనివారం కడప నుంచి ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి విచారణ నిమిత్తం చిత్తూరు వచ్చారు. ఈ సందర్భంగా గత ఏడాది నవంబరులో జరిగిన పీడీల పదోన్నతుల విషయమై డీఈవో నరసింహారెడ్డి తదితర అధికారులు, బాధిత పీడీలతో చర్చించారు.


కాగా, జీవో నెం.90 మేరకు మెరిట్‌ కాకుండా రోస్టర్‌ను పరిగణనలోకి తీసుకుని పదోన్నతులు కల్పించడంతో అర్హులైన పీడీలు నష్టపోయినట్లు ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. పలువురు అధికారులు బీసీలకు అనుకూలంగా వ్యహరించడంతో ఎస్టీలు నష్టపోయారని ఇందులో పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం 42 పీఈటీ పోస్టులను పని సర్దుబాటు పేరిట ఎస్జీటీలకు కేటాయించినట్లు తెలిపారు. దీంతో తమ దృష్టికి వచ్చిన అంశాలపై విచారణ చేపట్టామనీ, ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి ఆ మేరకు చర్యలు తీసుకుంటామని ఆర్జేడీ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-09-20T11:01:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising