ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూతపడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు రీస్టార్ట్‌ ప్యాకేజీ

ABN, First Publish Date - 2020-06-18T11:08:15+05:30

లాక్‌డౌన్‌ అమలుతో మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణకు ప్రభుత్వం రీస్టార్ట్‌ ప్యాకేజీ ప్రకటించినట్లు కలెక్టర్‌ భరత్‌గుప్తా తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ భరత్‌గుప్తా 


చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 17: లాక్‌డౌన్‌ అమలుతో మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణకు ప్రభుత్వం రీస్టార్ట్‌ ప్యాకేజీ ప్రకటించినట్లు కలెక్టర్‌ భరత్‌గుప్తా తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో డిస్ర్టిక్ట్‌ ఇండస్ర్టీస్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ... రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద ఈ ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు విద్యుత్తు, స్థిర, డిమాండ్‌ చార్జీలను మాఫీ చేయడం జరుగుతుందన్నారు.


కాపిటల్‌లో 20శాతం పూచీకత్తులేని రుణం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. త్వరలో ఏర్పాటయ్యే 27 భారీ, మెగా పరిశ్రమల ఏర్పాటుతో జిల్లాలో 44,887 మంది ఉపాధి పొందుతారన్నారు. 48 ఎంఎ్‌సఎంఈల ద్వారా 752 మంది ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టామన్నారు. ట్రైనీ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, జేసీ-2 చంద్రమౌళి, డీఐసీ జీఎం ప్రతా్‌పరెడ్డి, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ ఐ.ఎల్‌.రామ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-18T11:08:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising