ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదోన్నతుల్లో రాయలసీమకు అన్యాయం

ABN, First Publish Date - 2020-06-18T11:07:21+05:30

జలవనరులశాఖ ఇంజనీర్ల పదోన్నతుల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ఆ ఫోరం ప్రధాన కార్యదర్శి మురళీరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలవనరులశాఖ ఇంజనీర్ల  ఫోరం 


తిరుపతి రూరల్‌, జూన్‌ 17: జలవనరులశాఖ ఇంజనీర్ల పదోన్నతుల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ఆ ఫోరం ప్రధాన కార్యదర్శి మురళీరాజు అన్నారు. తిరుపతి జలవనరులశాఖ కార్యాలయం వద్ద బుధవారం భోజన విరామ సమయంలో ఇంజనీర్లు భౌతిక దూరం పాటిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా... రాష్ట్రపతి ఉత్తర్వులు అనుసరించకుండా పదోన్నతులకు సీనియారిటీ జాబితాలు తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జాబితా ప్రకారం 10నుంచి 15 ఏళ్లు జూనియర్‌ అయిన జోన్‌-1 ఇంజనీర్ల కింద రాయలసీమ ఇంజనీర్లు పనిచేయాల్సిన ఉంటుందన్నారు.


 మూడేళ్ల తరువాత రాష్ట్రంలోని ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు, ఆ పైస్థాయి పదవుల్ని జోన్‌-1 వారితో నింపుతారన్నారు. దీని వల్ల రాయలసీమలో సుమారు 500మంది ఇంజనీర్లు రివర్షన్‌ అవుతారన్నారు. బ్యాచ్‌వైజ్‌ సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు చేపట్టాలని ఆయన డిమాండు చేశారు. రాయలసీమ ఇంజనీర్లకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-18T11:07:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising