ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీడనిముసురు

ABN, First Publish Date - 2020-12-05T06:46:03+05:30

జిల్లావ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి.

సోమలలో వర్షంలోనే వరికోతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో రెండురోజులు ఇదే వాతావరణం


చిత్తూరు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాపై బురేవి తుఫాను ప్రభావం పెద్దగా లేకున్నా తూర్పు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. కాగా, పశ్చిమప్రాంత మండలాల్లో ముసురు వానలకు తోడు మోస్తరు వర్షం కురిసింది. గురువారం తెల్లవారుజాము నుంచి మొదలైన వర్షం శుక్రవారం రాత్రి వరకు ఎడతెరపి లేకుండా పడుతూనే ఉంది. శని, ఆదివారం కూడా తుఫాను ప్రభావం జిల్లాపై ఉండడంతో, చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో 7648 చెరువులుండగా, నివర్‌ ప్రభావంతో 139 మినహా అన్ని చెరువులకు నీళ్లు చేరాయి. ఇక ఆరు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండటంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు. తిరుపతి సమీపంలోని కల్యాణిడ్యాం పూర్తిస్థాయిలో నిండగా, ఇక్కడా గేట్లను ఎత్తివేశారు. జిల్లా జలాశయాల సామర్థ్యం మేరకు 4.281 టీఎంసీల నీళ్లు చేరాయి. నివర్‌ తుఫాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతోపాటు రోడ్లు, జలాశయాలకూ పెద్దఎత్తున నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. ఆ మేరకు జిల్లాలో తుఫాను తెచ్చిన నష్టం రూ.250 నుంచి రూ.300 కోట్లు ఉన్నట్లు కలెక్టర్‌ భరత్‌గుప్తా ఇప్పటికే వెల్లడించారు. 

       తూర్పుప్రాంతాలైన శ్రీకాళహస్తి, తొట్టంబేడు, కేవీబీపురం, బుచ్చినాయుడుకండ్రిగ, వరదయ్యపాళెం తదితర మండలాల్లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది. మధ్యాహ్నం భారీ వర్షం పడటంతో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా కేవీబీపురం మండలంలోని కాళంగి జలాశయ గేట్లను ఎత్తివేశారు. స్వర్ణముఖి నది ప్రవాహ ఉధృతి మరింత పెరిగింది. పశ్చిమప్రాంత మండలాల్లో చిరుజల్లులు పడుతూ ఉండగా, రోజంతా ముసురు వాతావరణం నెలకొంది.




 తిరుమలలో కొనసాగుతున్న ముసురు


తిరుమల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో శుక్రవారం కూడా బురేవా తుఫాన్‌ ప్రభావం కనిపించింది. గురువారం వేకువజామున మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దట్టమైన పొగమంచుతో చిరుజల్లులు పడుతున్నాయి. యధావిధిగా శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు వర్షంలో తడుస్తూనే వెళుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చాలామంది దర్శనం పూర్తికాగానే తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతున్నారు. ఘాట్‌ రోడ్డులో నెమ్మదిగా ప్రయాణించాలని వాహనదారులకు  అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - 2020-12-05T06:46:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising