ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎస్‌కే నేతను కోర్టులో హాజరుపరచండి

ABN, First Publish Date - 2020-12-11T06:24:36+05:30

మదనపల్లె శివారు వైఎస్సార్‌ కాలనీకి చెందిన ప్రగతిశీల కార్మిక సమాఖ్య (పీఎస్‌కే) జిల్లా నాయకుడు ఆంజనేయులును బుధవారం గుంటూరు పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.

పీఎస్‌కే నేత ఆంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పౌర హక్కుల సంఘం నాయకుల డిమాండ్‌


మదనపల్లె అర్బన్‌, డిసెంబరు 10: మదనపల్లె శివారు వైఎస్సార్‌ కాలనీకి చెందిన ప్రగతిశీల కార్మిక సమాఖ్య (పీఎస్‌కే) జిల్లా నాయకుడు ఆంజనేయులును బుధవారం గుంటూరు పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ ఘటనలో పోలీసుల తీరును పౌరహక్కుల సంఘం నేతలు గురువారం ఖండించారు. సీపీఐ స్థానిక కార్యాలయంలో పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ గుంటూరు పోలీసులు సివిల్‌ దుస్తుల్లో వచ్చి ఆంజనేయులును అరెస్టు చేసి తీసుకెళ్లడం సరికాదన్నారు. ఆయనపై వారెంట్‌ ఉంటే స్థానిక పోలీసులను సంప్రదించి తీసుకెళ్లాలన్నారు. కానీ దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి దొంగలా ఆయనను ఈడ్చుకెళ్లడం పద్ధతి కాదన్నారు. ఆంజనేయులుకు ఏదైనా హానిజరిగితే అందుకు పోలీసులే పూర్తిస్థాయిలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 24 గంటల్లోగా న్యాయస్థా నంలో హాజరుపరచాలని డిమాండ్‌ చేశారు. ఆంజనే యులు భార్య సుగుణ మాట్లాడుతూ ఇంట్లో ఉన్న తన భర్తను పోలీసులు ఈడ్చుకుని కారెక్కించి తీసుకెళ్లారన్నారు. తాను ప్రశ్నిస్తే తనను కూడా తీసుకెళ్లి, సీటీఎం వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై స్థానిక పోలీసులను అడగ్గా గుంటూరు పోలీసులు..ఎస్పీని సంప్రదించి, ఆయన అను మతి మేరకు ఆంజనేయులును అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు చిత్తూరు పోలీసుల ద్వారా తెలిసిందన్నారు. 

Updated Date - 2020-12-11T06:24:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising