ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివరాలివ్వని పండుటాకులకు పెన్షన్‌ కట్‌

ABN, First Publish Date - 2020-11-13T06:03:28+05:30

వివరాలివ్వని పండుటాకులకు పెన్షన్‌ కట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిసెంబరు 1న పడే నవంబరు పెన్షన్‌ నిలిపివేత


చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 12: జిల్లాలోని 2129 మంది విశ్రాంత ఉద్యోగులకు డిసెంబరు ఒకటిన చెల్లించాల్సిన నవంబరు నెల నుంచి పెన్షన్‌ అందని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జవనరిలో లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉన్నా కరోనా తదితర కారణాలతో అక్టోబరు 31వ తేది వరకు పలుసార్లు అవకాశాలిచ్చినా వాటిని సద్వినియోగానికి ముందుకు రాకపోవడంతో డెడ్‌లైన్‌ ముగిసింది. ప్రభుత్వం పొడిగింపునకు మరొక అవకాశం ఇవ్వకుండా పెన్షన్‌ చెల్లింపు ఆపివేతకు ఆదేశించింది. పెన్షన్‌ను కోల్పోతున్న 2129 మందిలో సర్వీస్‌ పెన్షనర్లు 882 మంది, ఫ్యామిలీ పెన్షనర్లు 1249 మంది ఉన్నారు. ఎస్టీవోల వారీగా చిత్తూరులో అత్యధికమంది ఉన్నారు. చిత్తూరులో 860, తిరుపతిలో 439, మదనపల్లెలో 224, పుత్తూరులో 118 మంది ఉండగా మిగిలిన 14 ఎస్టీవో కార్యాలయాల్లో అంతకంటే తక్కువ మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 18 సబ్‌ ట్రెజరీ కార్యాలయాల పరిధిలో 30434 మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ ఏటా నవంబరులో లైఫ్‌ సర్టిఫికెట్లను సమర్పిస్తుంటారు. ఈ ఏడాది జనవరి ఒకటవ తేది నుంచే వీటిని అందించాలని ప్రభుత్వం మార్పు చేసి ఆదేశాలిచ్చింది. అయితే గత నవంబరు నెలలోనే  వీటిని ఇచ్చిన వారిలో చాలా మంది ఇక ఇవ్వాల్సిన అవసరం లేదని భావించి ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అప్పట్లో అందిన సర్టిఫికెట్ల వివరాలను సబ్‌ ట్రెజరీ కార్యాలయ అధికారులు(ఎస్టీవో) ఆన్‌లైన్‌లో నమోదుచేశారు. కాగా  ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు పెన్షనర్లకు సజావుగానే పెన్షన్లు అందాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో లైఫ్‌ సర్టిఫికెట్లు నమోదైన వారికి మాత్రమే పెన్షన్ల చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గత  ఏడాది నవంబరులో లైఫ్‌ సర్టిఫికెట్లను సమర్పించి ఈ జనవరిలో అందజేయని పెన్షన్‌దారులకు ఆగస్టు 1న పెన్షన్‌ అందని పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశాన్ని జూలై 27న ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో దాదాపు వెయ్యి మంది వరకు పెన్షన్‌దారులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో, ఎస్టీవో కార్యాలయాల్లో అందజేశారు. ఆ తరువాత కరోనా కారణంగా ప్రభుత్వం గడువు పెంచి అక్టోబరు 31 వరకు డెడ్‌లైన్‌ విధించింది. ప్రస్తుతం అక్టోబరు 31వరకు కూడా వివరాలివ్వని 2129 మంది పెన్షన్‌దారుల పెన్షన్లను నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2020-11-13T06:03:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising