కొవిడ్ స్పెషల్ జైలుగా పీలేరు సబ్-జైలు
ABN, First Publish Date - 2020-07-08T11:28:27+05:30
పీలేరు సబ్‌జైలును కొవిడ్ స్పెషల్ జైలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖైదీలకు కరోనా పరీక్షలు చేసేందుకు ప్రతి జిల్లాలో ఒక జైలును కొవిడ్
పీలేరు, జూలై 7: పీలేరు సబ్‌జైలును కొవిడ్ స్పెషల్ జైలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖైదీలకు కరోనా పరీక్షలు చేసేందుకు ప్రతి జిల్లాలో ఒక జైలును కొవిడ్ స్పెషల్ జైలుగా ఎంపిక చేసింది. జిల్లాలోని వివిధ కోర్టులు రిమాండ్ విధించే పురుష ఖైదీలను మొదటగా పీలేరు సబ్‌జైలుకు తరలించి అక్కడ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్ వచ్చిన వారిని సంబంధిత జైళ్లకు తరలిస్తారు. పాజిటివ్ వస్తే జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రులకు పంపుతారు.
పీలేరు జైలులో కొవిడ్ పరీక్షలు చేసేందుకు తగిన సౌకర్యాలు కల్పించడమే కాకుండా ఖైదీలను తీసుకు రావడానికి.. తీసుకెళ్లడానికి అవసరమైన సిబ్బందిని నియమించాలని రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కుమార్ బిస్వజిత్ తన ఉత్తర్వుల్లో జైళ్ల శాఖ డీజీకి సూచించారు. పీలేరు సబ్‌జైలులో ప్రస్తుతం రెండు పురుషుల, ఒక మహిళా ఖైదీల బ్యారెక్‌లు ఉండగా, సాధారణంగా 50 మంది పురుషులు, 10 మంది మహిళా ఖైదీలను ఉంచొచ్చు. ప్రభుత్వం నుంచి అందిన ఉత్తర్వుల మేరకు పీలేరు జైల్లో తగిన ఏర్పాట్లు చేపట్టేందుకు జిల్లా జైళ్ల అధికారి హుస్సేన్‌రెడ్డి బుధ, గురువారాల్లో పీలేరులో పర్యటించనున్నారు.
Updated Date - 2020-07-08T11:28:27+05:30 IST