ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప ఎన్నిక ప్రచారానికి ‘పనబాక’ సిద్ధం

ABN, First Publish Date - 2020-11-26T06:10:25+05:30

తిరుపతి లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.

చంద్రబాబును కలిసిన పనబాక దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 28న తిరుపతికి రాక


తిరుపతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈమేరకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును బుధవారం ఆమె హైదరాబాద్‌లో కలిశారు. ఉప ఎన్నికపై చర్చించారు. ఈనెల 28వ తేదీ ఆమె తిరుపతికి రానున్నట్టు తెలిసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలసి ర్యాలీ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక నాయకులు కసరత్తు చేస్తున్నారు. కాగా, ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్‌ మీడియా శ్రేణులు పనబాక లక్ష్మిపై వదంతులు ప్రచారం చేస్తున్నారని తిరుపతి లోక్‌సభ కమిటీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి సుగుణ, అధికారప్రతినిధి డాక్టర్‌ ఎన్బీ సుధాకర్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. జగన్‌ 17 నెలల అవినీతి పాలనకు విసిగిపోయిన అన్ని వర్గాల ప్రజలు టీడీపీకి మద్దతు పలికి గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. 

Updated Date - 2020-11-26T06:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising