ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాప్‌తో ఫొటో తీసి.. పింఛను ఇచ్చేయండి

ABN, First Publish Date - 2020-03-31T12:19:32+05:30

వైఎస్‌ఆర్‌ పింఛను కానుక పంపిణీలో బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసిందని డీఆర్‌డీఏ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బయోమెట్రిక్‌ అవసరం లేదు

వలంటీర్లకు డీఆర్‌డీఏ పీడీ ఆదేశం


చిత్తూరు అర్బన్‌, మార్చి 30: వైఎస్‌ఆర్‌ పింఛను కానుక పంపిణీలో బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసిందని డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్‌ మురళి తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన ప్రత్యేక యాప్‌ను వలంటీర్లు డౌన్‌లోడ్‌ చేసుకుని.. లబ్ధిదారుల ఫొటో తీసి, పింఛన్‌ సొమ్ము ఇచ్చేయాలని ఆదేశించారు. సోమవారం డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో పింఛన్ల పంపిణీపై అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్షించారు.


పింఛన్ల పంపిణీకి అవసరమైన రూ.117.86 కోట్లను సచివాలయ కార్యదర్శుల ఖాతాల్లో సెర్ప్‌ జమ చేసిందన్నారు. బ్యాంకుల నుంచి నగదు డ్రాచేసి మంగళవారం సాయంత్రంలోపు వలంటీర్లకు అందజేయాలన్నారు. ఒకటో తేదీన మధ్యాహ్నంలోపు వందశాతం పింఛన్ల పంపిణీ పూర్తిచేయాలన్నారు. సాంకేతిక కారణాలతో ఎక్కడన్నా పూర్తికాకుంటే మరుసటి రోజు పంపిణీ పూర్తిచేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఐబీ పీఎం ప్రభావతి, ఏపీవో(పెన్షన్లు) రవి, తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2020-03-31T12:19:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising