తిరుమలలో నిహారిక, చైతన్య దంపతులు
ABN, First Publish Date - 2020-12-15T07:00:21+05:30
సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు
తిరుమల ఆలయం ముందు నిహారిక, చైతన్య
తిరుమల, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఇటీవల వివాహమాడిన నటుడు నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య దంపతులు సోమవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకున్న వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూప్రసాదాలు అందజేశారు. ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, సినీ దర్శకుడు శ్రీనువైట్ల, నటుడు వాసుదేవ్ కూడా వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకున్నారు.
Updated Date - 2020-12-15T07:00:21+05:30 IST