ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొబైల్‌ గేమ్‌ గొడవ ముదిరి మూడిళ్లపై దాడి

ABN, First Publish Date - 2020-12-01T05:47:28+05:30

పిల్లల మొబైల్‌ గేమ్‌ కారణంగా చెలరేగిన వివాదం ముదిరిపోయి దాడులకు దారితీసింది

పెనుమూరు మండలం కన్నికాపురంలో ఓ ఇంటి కిటికీలుఽ ద్వంసమైన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెదురుకుప్పం, నవంబరు 30:పిల్లల మొబైల్‌  గేమ్‌ కారణంగా చెలరేగిన వివాదం ముదిరిపోయి దాడులకు దారితీసింది.  ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌, గ్రామస్తుల కథనం మేరకు.... పెనుమూరు మండలం గుంటిపల్లె పంచాయతీ కన్నికాపురం బీసీ కాలనీ, కన్నికాపురం గ్రామానికి చెందిన పిల్లలు ఆదివారం మొబైల్‌ గేమ్‌ ఆడారు.ఓడిపోయిన కుర్రాడు గెలిచిన వాళ్లకు డబ్బివ్వలేకపోవడంతో అతడి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయమై వివాదం చెలరేగడంతో ఆదివారం పులిగుంటీశ్వర ఆలయం వద్ద పంచాయితీ నిర్వహించారు. ఈ క్రమంలో కన్నికాపురానికి చెందిన కె.పవన్‌ మరికొందరు కలసి ఆదివారం రాత్రి బీసీకాలనీలోని టి.ధనలక్ష్మి, టి.శారద, టి.సుగుణ ఇళ్లపై  కర్రలు, రాళ్లతో దాడి చేశారు. కిటికీ అద్దాలు పగలగొట్లారు. ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు.  మహిళలను దుర్భాషలాడారు. సోమవారం బాధితుల ఫిర్యాదు మేరకు కన్నికాపురానికి చెందిన కె.పవన్‌, కె.సందీప్‌, జి.హేమంత్‌, కె.సురేష్‌, కె.నిర్మల, జి.విమల, ఎం.సోము, టి.వెంకటేష్‌, ఢిల్లీ, ఎం.రెడ్డెప్ప, ఎం.గుణశేఖర్‌, ఎం.కిరణ్‌, ఎం.సాయి, పి.సాయి, జ్ఞానశేఖర్‌, ఎం.రాముపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - 2020-12-01T05:47:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising