ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరుడి మిత్రుడికి కరోనా.. పెళ్లికి హాజరైన జనాల్లో ఆందోళన

ABN, First Publish Date - 2020-06-07T15:28:44+05:30

మిత్రుడి పెళ్ళికి హాజరయ్యేందుకు బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి/గంగాధర నెల్లూరు : మిత్రుడి పెళ్ళికి హాజరయ్యేందుకు బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు తేలడంతో ఆ వివాహానికి హాజరైన వారంతా ఆందోళనకు గురవుతున్నారు. గంగాధర నెల్లూరు మండలం ముక్కళత్తూరు పంచాయతీ మిట్టదళితవాడలో జరిగే పెళ్లికి గాను బెంగళూరుకు చెందిన వరుడితో పాటు అతడి మిత్రులు గురువారం బయల్దేరారు. పలమనేరు చెక్‌ పోస్టు వద్ద అధికారులు ఆపి కరోనా పరీక్షలు చేసి పంపించారు. శుక్రవారం సాయంత్రం పెళ్లి తంతు ముగిశాక వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలిందని గంగాధర నెల్లూరు ఎస్‌ఐ మధుసూదన రావుకు సమాచారం అందింది. దీంతో ఆయన వెంటనే పాజిటివ్‌గా గుర్తించిన వ్యక్తిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


అలాగే వైద్య, రెవిన్యూ, మండల పరిషత్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారుల బృందం ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించింది.మొత్తం 66మందికి డాక్టర్లు షర్మిల, పురుషోత్తం, శళికుమార్‌ కరోనా టెస్టులు చేశారు. మిట్ట దళితవాడను రెడ్‌జోన్‌గా ప్రకటించి బ్లీచింగ్‌, స్ర్పేయింగ్‌ , చేశారు. డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, సీఐ బాలయ్య, ఎంపీడీవో శ్రీదేవి, ఇంచార్జి తహసీల్దార్‌ తులసీరాం, సీహెచ్‌వో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-07T15:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising