సామాజిక దూరం పాటిద్దాం
ABN, First Publish Date - 2020-03-27T10:07:50+05:30
చిత్తూరు నగర వాసులకు నిత్యావసరాలు, కూరగాయలు అందుబాటులో ఉంచేందుకు నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేశు సిబ్బందితో కలిసి చర్యలు తీసుకుంటున్నారు.
చిత్తూరు మార్కెట్లో ప్రజలకు కమిషనర్ అవగాహన
చిత్తూరు, మార్చి 26: చిత్తూరు నగర వాసులకు నిత్యావసరాలు, కూరగాయలు అందుబాటులో ఉంచేందుకు నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేశు సిబ్బందితో కలిసి చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా విశాలమైన మైదానాల్లో మార్కెట్లను ఏర్పాటు చేయడంతో పాటు సామాజిక దూరం పాటించేలా అవగాహన కల్పిస్తున్నారు. నిత్యావసర వస్తువులను ప్రజల ఇళ్ల వద్దకు చేర్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చి నగరంలో ఇళ్లలో ఉంటున్నవారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రతి పది మందికి ఒక్క ప్రత్యేక అధికారిని నియమించి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో క్రిమిసం హారక మందులను పిచికారి చేయించారు.
Updated Date - 2020-03-27T10:07:50+05:30 IST