ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మగ్గిన బియ్యమే దిక్కు

ABN, First Publish Date - 2020-11-23T06:56:20+05:30

మగ్గిన బియ్యం.. పాడైన నిత్యావసర సరుకులే ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కాబోతున్నాయి. సోమవారం నుంచి జిల్లాలో ప్రారంభంకానున్న సంక్షేమ శాఖ వసతిగృహాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

మూలనపడిన బియ్యం బస్తాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎనిమిది నెలలుగా హాస్టళ్లలో నిత్యావసరాలు 

 నేటి నుంచి ప్రభుత్వ హాస్టళ్ల ప్రారంభం


చిత్తూరు, నవంబరు 22: మగ్గిన బియ్యం.. పాడైన నిత్యావసర సరుకులే ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కాబోతున్నాయి. సోమవారం నుంచి జిల్లాలో ప్రారంభంకానున్న సంక్షేమ శాఖ వసతిగృహాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే.. కొవిడ్‌ లాక్‌డౌన్‌తో మార్చి 23వతేది నుంచి హాస్టళ్లు మూతపడ్డాయి. అయితే మార్చి, ఏప్రిల్‌ నెలల నిత్యావసరాల నిల్వలను టెండరుదారులు ఫిబ్రవరి 27న వసతిగృహాలకు సరఫరా చేశారు. వీటిలో బియ్యం, కందిపప్పు, శనగపప్పు, మిర్చి, నూనె, గోధుమ, రవ్వ, కోడిగుడ్లు తదితర 14 రకాలున్నాయి. వీటిని ఎనిమిది నెలలుగా అలాగే ఉంచేయడంతో ముగ్గిపోయి కంపుకొడుతున్నాయి. చింతపండు బూజుపట్టి పనికిరాకుండా పోయింది. అన్ని వసతిగృహాల్లో రూ.కోటి విలువైన వస్తువులు మగ్గిపోయినట్లు అంచనా. వీటిని ఇతర అవసరాలకు తరలించి.. ప్రస్తుతం తాజాగా సరఫరా చేసుంటే బాగుండేది. కాగా, దీనిపై ఓ అధికారికి ఇటీవల ఓ వార్డెన్‌ వివరించగా, మీ బాధలు మీరు పడండని ఉచిత సలహా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో మగ్గిన బియ్యం, నెలలుగా నిల్వ ఉన్న సరుకులతో భోజనం ఎలా వండి పెట్టాలని వార్డెన్లు వాపోతున్నారు. ఈ ఆహారం తిని 119 సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాల్లో దాదాపు 10 వేల మంది విద్యార్థుల్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఏంటి పరిస్థితని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-11-23T06:56:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising