ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరవీరులకు లాల్‌సలాం

ABN, First Publish Date - 2020-06-18T11:05:44+05:30

లద్ధాఖ్‌లో వీరమరణం పొందిన భారత జవాన్లకు బుధవారం జిల్లా అంతటా నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (యశోదనగర్‌/తిలక్‌రోడ్‌/ పద్మావతినగర్‌/ విశ్వవిద్యాలయాలు)/చంద్రగిరి, జూన్‌ 17: లద్ధాఖ్‌లో వీరమరణం పొందిన భారత జవాన్లకు బుధవారం జిల్లా అంతటా నివాళులర్పించారు. తిరుపతిలోని అమరవీరుల స్థూపం వద్ద జవాన్ల చిత్రపటాలను, జాతీయ జెండాను బీజేపీ నాయకులు ప్రదర్శిస్తూ జోహార్లు అర్పించారు. చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్‌, కార్యవర్గ సభ్యుడు మునిసుబ్రమణ్యం, మాజీ నగర అధ్యక్షుడు వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


జెన్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాండిల్‌ ర్యాలీలో రాజేష్‌, భానుప్రకాష్‌రెడ్డి, సి.కిరణ్‌కుమార్‌, భవానీశంకర్‌, వివిధ క్రీడాసంఘాల సభ్యులు పాల్గొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చిత్రపటాలను దహనం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుండాల గోపినాథ్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో జవాన్‌ బి.సంతోష్‌ చిత్రపటానికి దిండికుర్తి నరసింహులు కార్యదర్శి శ్రీధర్‌, హేమచంద్రకుమార్‌, వెంకటేష్‌గుప్తా, నాగరాజు, శ్రీరాములు, సురేష్‌ తదితరులు నివాళులర్పిం చారు. న్యాయపరిరక్షణ చైతన్య సమితి, జైహిందూస్థాన్‌ పార్టీ నేతలు మేడా లోకేష్‌బాబు, బోడగలమునిబాబు ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించారు. అమర జవాన్ల స్మారక స్థూపం వద్ద ఏపీ జేఏసీ జిల్లా నేత కోటగారం మురళి నివాళులర్పించారు. 

Updated Date - 2020-06-18T11:05:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising