ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఒంటరి’యై.. భీతావహం సృష్టిస్తూ..!

ABN, First Publish Date - 2020-09-28T18:00:22+05:30

మదపు టేనుగు 20 ఏళ్ల నడి వయసులో ఉంది. ఏ గుంపులోనూ కలవడంలేదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజదాడి వెనుక విషాద నేపథ్యం


కుప్పం(చిత్తూరు): మదపు టేనుగు 20 ఏళ్ల నడి వయసులో ఉంది. ఏ గుంపులోనూ కలవడంలేదు. ఇతర ఏనుగుల మందలూ దీన్ని దరి చేరనివ్వడంలేదు. మరి దీని సొంత మందేమైంది? ఇలా ఎందుకు ఒంటరిగా తిరుగుతోంది? అంతుపట్టని సస్పెన్స్‌గా మారింది అటవీ శాఖాధికారులకు కూడా. ఏనుగు దాడుల్లో మృతులను చూడడానికి వస్తున్న తమిళనాడువాసులు, అటవీశాఖ సిబ్బంది ద్వారా ఈ చిక్కుముడి వీడింది. వారు చెప్పుకొచ్చారా మదపు టేనుగు ఒంటరి తనం గురించి.. చిప్పిల్లే విషాద నేపథ్యం గురించి.


ఈ మగ మదపు టేనుగుకూ గతంలో చిన్న కుటుంబం ఉండేది. ఆడ ఏనుగు తోడుగా, ఐదారేళ్ల గున్న ఏనుగు బిడ్డను వెంట తీసుకుని తమిళనాడు అటవీప్రాంతం నివాసంగా సంచరించేది. ఏనాడూ గ్రామాలవైపు వచ్చింది లేదు. మనుషులకు హాని తలపెట్టిందీ కాదు. హఠాత్తుగా ఓ రోజున ఆడ ఏనుగు, గున్న ఏనుగు మృతి చెందాయి. అడవి పందులకోసం చేలవద్ద రైతులు పెట్టిన కరెంటు తీగలకో, లేక విలువైన దంతాలకోసం వేటగాళ్లు పన్నిన ఉచ్చుకో చిక్కుకుని ప్రాణాలొదిలాయి. అంతే.. మగ ఏనుగు జీవితంలో పెను చీకట్లు కమ్ముకున్నాయి. విషాద ఛాయలు అలుముకున్నాయి. తమిళనాడు అడవుల్లోని మిగిలిన ఏనుగుల గుంపులతో కలవలేకపోయింది.


అవి కూడా క్రమేణా దీన్ని దూరం పెడుతూ వచ్చాయి. అయినవారిని కోల్పోయి, మరో నమ్మకమైన తోడుకోసం తపించపోసాగిందా గజరాజు. క్రమేణా ఆ తపన మదంగా మారింది. మదపుటేనుగుగా మారి కర్ణాటక రాష్ట్రంలోకి సుమారు పదిహేను రోజుల క్రితం చొరబడి అక్కడో వ్యక్తిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచింది. ఇప్పుడు కుప్పం నియోజకవర్గ అటవీ సమీప గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ఇంతకుముందెప్పటి నుంచో మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో 7-40 ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. వాటిలో ఈ ఒంటరి ఏనుగు కలవలేక పోతోంది.


కలవాలని ప్రయత్నించినా ఆ గుంపులు రానివ్వడంలేదు. అందుకే మరింత పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తూ అటవీ సమీప గ్రామాల్లో భీతావహ పరిస్థితులు సృష్టిస్తోంది. అటు గ్రామీణులకు, ఇటు అటవీ శాఖాధికారులకు నిద్ర లేకుండా చేస్తోంది. మనుషులకే కాదు.. మూగ జీవులకూ విషాద నేపథ్యాలుంటాయని తెలుస్తోంది. కాగా, దీనిని బంధించి తిరుపతి జూకు తరలించడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.  


Updated Date - 2020-09-28T18:00:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising