ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 నుంచి భూ విలువల పెంపు

ABN, First Publish Date - 2020-08-02T10:41:52+05:30

జిల్లావ్యాప్తంగా ఈనెల 10 నుంచి భూముల ధరలు పెరగనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 1: జిల్లావ్యాప్తంగా ఈనెల 10 నుంచి భూముల ధరలు పెరగనున్నాయి. ఈ వివరాలను ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో ఉంచగా, వీటిపై శనివారం నుంచి అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమైంది. ఏటా ఆగస్టు ఒకటోతేది నుంచి భూ విలువల పెంపు ప్రక్రియ జరుగుతోంది. ఆ మేరకు చిత్తూరు రిజిస్ట్రేషన్‌ జిల్లా, తిరుపతి బాలాజీ రిజిస్ర్టేషన్‌ జిల్లా పరిధిలోని 25 సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల అధికారులు దీనికి సంబంధించిన ప్రతిపాదనలు జేసీ మార్కొండేయులుకు సమర్పించారు.


దీనిపై ఆయన గతనెల 31న జిల్లా మార్కెట్‌ వ్యాల్యూ రివిజన్‌ కమిటీ సమావేశంలో సమీక్షించి, ఆ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. దీంతో శనివారం నుంచి పెంచిన భూ విలువల వివరాలను రిజిస్ర్టేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఇందులో ఏ ప్రాంతంలో భూముల ధరలు పెంచారు, ఎంతమేర పెరిగాయి, ఆయా సర్వే నెంబర్ల వివరాలున్నాయి. కాగా, రివిజన్‌ కమిటీలో తీసుకున్న నిర్ణయాలపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను వారంరోజుల పాటు పరిశీలిస్తామని రిజిస్ర్టేషన్ల శాఖ డీఐజీ పుష్పలత చెప్పారు. ఈనెల 10 నుంచి పెంచిన భూ విలువలను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-02T10:41:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising