ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ భవనాలకు తెల్లరంగు

ABN, First Publish Date - 2020-06-06T16:50:20+05:30

జిల్లాలోని సచివాలయ భవనాలకు వైసీపీ రంగులను తొలగించి తెల్లరంగు వేయాలని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ రంగులను తొలగించమని ఎంపీడీవోలకు మౌఖిక ఆదేశాలు


చిత్తూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సచివాలయ భవనాలకు వైసీపీ రంగులను తొలగించి తెల్లరంగు వేయాలని మండలాలకు ఆదేశాలు అందాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వార్డు, గ్రామ సచివాలయాలను వైసీపీ రంగులతో అలంకరించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఈ రంగులను తొలగించాలని తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. వెంటనే రంగులను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో జిల్లాలోని 1035 గ్రామ సచివాలయ భవనాలకు తెల్లరంగు వేయాలని జిల్లా కేంద్రం నుంచి ఎంపీడీవోలకు శుక్రవారం ఆదేశాలందాయి. అయితే 277 వార్డు సచివాలయ భవనాలకు రంగుల మార్పు గురించి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఇప్పటివరకు మౌఖిక ఆదేశాలు మాత్రమే అందాయని, వారం రోజుల్లోగా అన్ని సచివాలయాలకు రంగు మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఒక ఎంపీడీవో తెలిపారు.

Updated Date - 2020-06-06T16:50:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising