ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసులో ఐదుగురి అరెస్టు

ABN, First Publish Date - 2020-08-04T10:58:42+05:30

భూ వివాదంతో కొత్తగొల్లపల్లెలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తవణంపల్లె, ఆగస్టు 3: భూ వివాదంతో కొత్తగొల్లపల్లెలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. కొత్తగొల్లపల్లెకు చెందిన వాసు, ఉమాకాంత్‌ మధ్య కొంత కాలంగా భూ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గత నెల 27న ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో వాసు వర్గానికి చెందిన శంకరయ్య(64) తీవ్రంగా గాయపడ్డాడు.


ఆయన చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో  హత్య కేసును నమోదు చేసిన చిత్తూరు వెస్ట్‌ సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి దర్యాప్తు జరిపారు. నిందితులైన ఉమాకాంత్‌(29), ఎల్లప్ప(65), దేవరాజులు(30), విజయకుమార్‌(25), శంకరయ్య(61)ను సోమవారం కె.పట్నం సమీపంలోని తిరుపతి హైవే రోడ్డు వద్ద అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-08-04T10:58:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising