ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోనేరుకుప్పం వద్ద ఏనుగుల గుంపు

ABN, First Publish Date - 2020-12-10T05:41:27+05:30

శాంతిపురం మండలం కోనేరు కుప్పం సమీపంలోని నీలగిరి చెట్ల తోపులో బుధవారం ఏనుగుల గుంపు తిష్ట వేసింది.

నీలగిరి తోటలో ఉన్న ఏనుగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాంతిపురం, డిసెంబరు 9: శాంతిపురం మండలం కోనేరు కుప్పం సమీపంలోని నీలగిరి చెట్ల తోపులో బుధవారం ఏనుగుల గుంపు తిష్ట వేసింది. దీంతో సమీపంలోని గ్రామాల ప్రజలు, రైతులు, ఆందోళన చెందుతున్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతం విశ్వనాథపురం అటవీప్రాంతం నుంచి మంగళవారం రాత్రి ఏనుగుల గుంపు శాంతిపురం మండలంలోకి ప్రవేశించింది. ఈ విషయం తెలుసుకున్న కుప్పం అటవీ క్షేత్రాధికారి మధుసూదన్‌ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ఏనుగులను చూసేందుకు వచ్చిన జనాన్ని అక్కడి నుంచి పంపివేశారు. ఏనుగులను కర్ణాటకలోని అడవిలోకి తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏనుగులు కర్ణాటక అడవిలోకి వెళ్లేంత వరకు  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటీవీ అధికారి మధుసూదన్‌ కోరారు.


Updated Date - 2020-12-10T05:41:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising