ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గమ్మా పాహిమాం

ABN, First Publish Date - 2020-10-25T10:49:32+05:30

బహుశా దసరా వస్తున్నదనేమో కరోనా తగ్గుముఖం పడుతోంది. దుర్గామాత ఉగ్ర దృక్కులను కాచుకోలేకేమో.. నక్కినక్కి వెనక్కు తగ్గుతున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పం: బహుశా దసరా వస్తున్నదనేమో కరోనా తగ్గుముఖం పడుతోంది. దుర్గామాత ఉగ్ర దృక్కులను కాచుకోలేకేమో.. నక్కినక్కి వెనక్కు తగ్గుతున్నది.ఆ నమ్మకంతోనేనేమో.. వ్యాపార వర్గాలు తమ దుకాణాల తలుపులు తెరిచి  పండుగ సంబరాలకు సిద్ధమయ్యారు. లాక్‌డౌన్‌ ప్రభావంతో ఇన్నాళ్లూ కోల్పోయిన వ్యాపారాలను, భరించిన నష్టాలను తిరిగి భర్తీ చేసుకోగలమన్న భరోసాతో గల్లా పెట్టెల ముందు కూర్చుంటున్నారు. గుమ్మడి కాయలు పగుల గొట్టి, కర్పూర నీరాజనాలు సమర్పించి ఆ దుర్గామాతకు సభక్తికంగా పూజలు చేస్తున్నారు.


జనం కూడా ఇప్పుడిప్పుడే కరోనా భయాన్ని వీడి వీధుల్లోకి వస్తున్నారు. ఇన్నాళ్లూ వాయిదా వేసిన శుభకార్యాలకు ముహూర్తాలు నిర్ణయిస్తున్నారు. ఉగ్రరూపిణియైు శాసించినా, అమృత స్వరూపిణిగా మారి ఆలించినా.. మన మేలు కోరే చల్లని తల్లి ఆ దుర్గాదేవి అన్న నమ్మకంతో సకల నైవేద్యాలనూ సిద్ధం చేసుకుని పూజా మందిరాల ఎదుట వేచి చూస్తున్నారు.మొత్తానికి దసరా కోలాహలం ఊరూవాడా కన్పిస్తోంది. ఇన్నాళ్లూ కరోనా కష్టాల్లో కూరుకుపోయిన సకల జన సందోహమూ పండుగ ఉత్సాహంతో దుర్గామాతను కొలవడానికి సిద్ధమైపోయింది.         

Updated Date - 2020-10-25T10:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising