ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్రావిడ వర్శిటీ వీసీగా తుమ్మల రామకృష్ణ బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2020-11-29T06:17:52+05:30

ద్రావిడ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా ఆచార్య రామకృష్ణ శనివారం బాధ్యతలు స్వీకరించారు.

వీసీగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆచార్య తుమ్మల రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పం, నవంబరు 28: ద్రావిడ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా ఆచార్య రామకృష్ణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు డిపార్టుమెంట్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న ఈయనను ద్రావిడ వర్శిటీ వీసీగా నియమిస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ నెల 26వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తుమ్మల రామకృష్ణ ద్రావిడ విశ్వవిద్యాలయం చేరుకుని పరిపాలనా భవనంలో అధికారికంగా వీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి వీసీగా ఉన్న డాక్టర్‌ అనూరాధ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా వర్శిటీలోని బోధన, బోధనేతర సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. విశ్వవిద్యాలయం వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉష, వర్శిటీ ప్రధాన కార్యదర్శి మణి, మణివేలు, అనిల్‌కుమార్‌రెడ్డి, రూప సుందర్‌రెడ్డి, సుభాష్‌, బాలాజీ తదితరులు పుష్పగుచ్ఛం అందించి, శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వీసీ ఆడిటోరియంలో బోధన, బోధనేతర సిబ్బందితో సమావేశమయ్యారు. వర్శిటీ అభివృద్ధికి కృషి చేస్తానని, అందుకు అందరి సహకారం అవసరమని కోరారు. 

Updated Date - 2020-11-29T06:17:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising