ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడిలో కూలిపోయిన రెండంతస్తుల ఇల్లు

ABN, First Publish Date - 2020-12-06T05:50:59+05:30

కలికిరి మండలంలోని పల్లవోలు పంచాయతీ గడి గ్రామంలో శనివారం రాత్రి 8.30 ప్రాంతంలో ఓ ఇల్లు ఉన్నట్టుండి కూలిపోయింది.

నిలువునా కూలిపోయిన బండల మిద్దె
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యజమానులు క్షేమం 


కలికిరి, డిసెంబరు 5: కలికిరి మండలంలోని పల్లవోలు పంచాయతీ గడి గ్రామంలో శనివారం రాత్రి 8.30 ప్రాంతంలో ఓ ఇల్లు ఉన్నట్టుండి కూలిపోయింది. ఆ ఇంట్లో నివసిస్తున్న దంపతులు ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కొంచెం పాతబడిన బండల మిద్దెపైన రెండు గదులు నిర్మించడంతో వర్షానికి ఇల్లు మొత్తం నిట్టనిలువునా కుప్పకూలింది. బండలు పడడంతో ఇంట్లోని టీవీ, వాషింగ్‌ మిషను, బీరువాలు, మంచాలతో పాటు వివిధరకాల పాత్రలన్నీ నుజ్జునుజ్జయ్యాయి. రెండంతస్తుల ఇల్లు కుప్పకూలిపోవడంతో గ్రామస్తులంతా పరుగులు తీశారు. దీనికి తోడు ఇంటి పరిసర ప్రాంతాలు చీకటిమయంగా కావడంతో సుమారు గంటపాటు ఊరిలో గందరగోళం నెలకొంది. అసలు ఇంట్లో వున్న వృద్ధులు ఏమయ్యారన్న ఆందోళన కొద్దిసేపు నెలకొంది. అయితే ఇద్దరూ.. సమీపంలోని కుమారుడి ఇంటికి భోజనానికి వెళ్లడంతో క్షేమంగా ఉన్నట్లు తెలుసుకుని తెరిపినపడ్డారు. కూలిపోయిన ఇంటిని చూసి వృద్ధ దంపతులు గుండెలు బాదుకున్నారు.

Updated Date - 2020-12-06T05:50:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising